
ఐదెకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్
● జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత మల్లారెడ్డి
చొప్పదండి: త్వరలో చొప్పదండి సహకార సంఘం సొంత భూమి ఐదెకరాల్లో సోలార్ పవర్ ప్లాంటు నిర్మించి, ప్రభుత్వానికి రోజుకు 4,500 యూనిట్ల కరెంటు విక్రయిస్తామని జాతీయ ఉత్తమ పీఏసీఎస్ అవార్డు గ్రహీత వెల్మ మల్లారెడ్డి అన్నారు. ఐక్యరాజ్యసమితి 2025 సంవత్సరాన్ని సహకార సంవత్సరంగా గుర్తించిన నేపథ్యంలో చొప్పదండి పీఏసీఎస్‌లో క్రిబ్‌కో సంస్థ ద్వారా అంతర్జాతీయ సహకార వారోత్సవాలు నిర్వహించారు. మల్లారెడ్డి మాట్లాడుతూ సంఘం అర్జించే లాభాల్లో రైతులకు పదిశాతం డివిడెంట్ అందిస్తున్నామని తెలిపారు. జిల్లా సహకార అధికారి రామానుజాచార్యులు మాట్లాడుతూ రైతులు విధిగా భూసార పరీక్షలు చేయించాలని కోరారు. ఏరియా మేనేజర్ నవీన్ కుమార్, సంఘం ఉపాధ్యక్షుడు ముద్దం మహేశ్ గౌడ్, మాజీ సహకార అధికారి గుర్రం ఇంద్రసేనారెడ్డి, సీఈవో కళ్లెం తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.