
జాతీయ పోటీలకు మాధవి
కరీంనగర్‌స్పోర్ట్స్: గుజరాత్ ఈ నెల 3వ తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ సీనియర్ మహిళల చాంపియన్ షిప్ పోటీలకు ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ క్రీడాకారిణి మాధవి ఎంపికై నట్లు సంఘం అధ్యక్ష కార్యదర్శులు వీర్ల వెంకటేశ్వర్‌రావు, బసరవేణి లక్ష్మణ్‌లు తెలిపారు. మంచిర్యాల జిల్లా మంద్రమర్రిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి జాతీయపోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. మాధవి ప్రస్తుతం రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో కానిస్టేబుల్‌గా కొనసాగుతున్నారు. మాధవిని తెలంగాణ హ్యాండ్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్, డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, నమిలికొండ ప్రభాకర్, కోచ్ మూల వెంకటేశ్ అభినందించారు.
తైక్వాండో పోటీల్లో ప్రతిభ
చొప్పదండి: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొన్న మండలంలోని రుక్మాపూర్ మాడల్ స్కూల్ విద్యార్థులు పలు పతకాలు సాధించారు. పదోతరగతి విద్యార్థి శ్రీగాధ స్పందన గోల్డ్ మెడల్ సాధించగా, జునగారి రాంచరణ్ రెండు విభాగాల్లో గోల్డ్, బ్రౌంజ్ మెడల్ సాధించారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ నిమ్మల సుధాకర్ అభినందించారు.

జాతీయ పోటీలకు మాధవి