
పునర్విభజనలో కాంగ్రెస్ జోక్యం లేదు
● సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని డివిజన్‌ల పునర్విభజనలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా జోక్యం చేసుకోలేదని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. మతం పేరుతో రాజకీయ లబ్ధిపొందేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. శనివారం నగరంలోని సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పచ్చకామెర్ల వ్యాధి ఉన్నోళ్లకు లోకమంతా పచ్చగా కనిపించినట్టు, గతంలో వారి హాయాంలో జరిగినట్టే ఇప్పుడు జరిగిందనుకుంటున్నారని ఎద్దేవా చేవారు. అధికారులు అందరి వినతులను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా పునర్విభజనచేశారన్నారు. కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ ఒక్క రూపాయి తేలేదన్న వ్యక్తి, ఈ రోజు సంజయ్ అభివృద్ధి ప్రదాత అంటున్నాడని విమర్శించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శ్రవణ్ నాయక్, జీడీ రమేశ్, దన్నా సింగ్, దండి రవీందర్, ఆస్థాపురం రమేశ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, బషీర్, బారి, సాయిరాం, రాజ్ కుమార్, షబాన, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.