
లక్ష్యం నిర్దేశించుకుని చదవాలి
సుల్తానాబాద్: విద్యార్థులు, యువత లక్ష్యం నిర్దేశించుకుని చదవాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో శనివారం జిల్లా స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో పట్టణ స్వర్ణకారుల సహకార సంఘం సహకారంతో విశ్వబ్రాహ్మణ సహకార కుటుంబ సభ్యులు పదో తరగతి, ఇంటర్‌లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదవాలని, ఎలాంటి పరిస్థితి వచ్చినా భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. సినీనటులు సంపూర్ణేశ్ బాబు, బలగం రాజయ్య చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు రంగు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీరామోజు రాజు, పట్టణ కోశాధికారి కనపర్తి భాస్కరాచారి, వేణు, బెజ్జంకి రవి, చందు, మహేందర్, శ్రావణ్, సదానందం, రాజేందర్, వెంకటస్వామి, రవీందర్ పాల్గొన్నారు.