
తండ్రి లేని లోటును తీర్చి..
రామగుండం: అంతర్గాం మండలం కుందనపల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన బొంగోని సమ్మయ్య– తిరుమల దంపతులకు ప్రియాంక, భూమిక సంతానం. సమ్మయ్య స్థానికంగా పెట్రోల్ బంక్‌లో పని చేస్తూ 2006లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో భార్యపై కుటుంబ భారం పడింది. 2007లో అక్బర్‌నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్‌గా ఉద్యోగంలో చేరిన తిరుమల కుటుంబపోషణ కష్టంగా మారినా తన కూతుళ్లకు ఉన్నత చదువులు చదివించి తండ్రి లేని లోటును తీర్చింది. గతేడాది ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరడంతో తిరుమలకు ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగింది. పెద్ద కూతురుకు వివాహం చేయడంతో హైదరాబాద్‌లో స్థిరపడగా, చిన్న కూతురు హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తోంది.