
ప్రాణం తీసిన కట్నం వేధింపులు
● చికిత్స పొందుతూ వివాహిత మృతి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామానికి చెందిన దాసరి రమా(33) ఆదివారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందింది. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. గొల్లపల్లి గ్రామానికి చెందిన శ్రీశైలంతో రమాకు 15ఏళ్లక్రితం వివాహమైంది. వీరికి ఒక కొడుకు, ఒక కూతరు ఉన్నారు. అయితే, ఇంకా కట్నం కావాలని భర్త ఆమెను కొద్దిరజులుగా మానసికంగా, శరీరకంగా వేధిస్తున్నాడు. అంతేకాకుండా వివాహేతర సంబంధం అంటగట్టాడు. మనస్తాపం చెందిన రమా ఇరవై రోజుల క్రితం పూసాలలోని తల్లిగారింటికి వచ్చింది. అయితే, భర్త తరచూ ఆమెకు ఫోన్ చేస్తూ కట్నం తీసుకొస్తేనే ఇంటికి రావాలని వేధించసాగాడు. మానసికంగా కుంగిపోయిన రమ ఇంట్లో ఎవరూ లేనిసమయంలో పురుగులమందు తాగింది. ఆ తర్వాత వచ్చిన కుటుంబసభ్యులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎంకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతు రాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త శ్రీశైలం, అత్త కొమురమ్మ, తోటికొడలు లక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
గోదావరిలో ఎమ్మెల్యే భార్య అస్థికల నిమజ్జనం
బాసర: చొప్పదండి ఎమ్మెల్యే సత్యం తన భార్య అస్థికలను సోమవారం నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరిలో నిమజ్జనం చేశారు. ఆయన భార్య రూప ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గోదావరి తీరంలో కుటుంబ సభ్యులతో కలిసి పిండప్రదానం చేశారు. కార్యక్రమంలో బాసర పీఏసీఎస్ డైరెక్టర్ మమ్మయి నరేశ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment