
మాట్లాడుతున్న గజ్జెల కాంతం
కరీంనగర్: బీజేపీ మహిళా బిల్లును ఆమోదించడం వెనుక ఓట్ల రాజకీయం ఉందని, ఇచ్చిన హమీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించడం వెన్నతో పెట్టిన విద్య అని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం విమర్శించారు. గురువారం నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లౌకిక వాదాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మహిళా బిల్లుకు ఆమోదం తెలుపుతూ 2029 నుంచి అమలవుతుందని ప్రధాని మోదీ మాట్లాడటం రానున్న ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకేనని ఆరో పించారు. బీజేపీ గతంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హమీని అమలు చేయలేదని అన్నారు. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదని, కుల గణన చేపడుతామని చెప్పి చేతులేత్తేశారని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఆమలు చేస్తామని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని రక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 4న కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో జరిగే ప్రజాగర్జనను జయప్రదం చేయాలని కోరారు. నా యకులు సముద్రాల అజయ్, గజ్జెల ఆనందరావు, జీఎస్ ఆనంద్, వసీం అహ్మద్, సర్దార్ రాణాసింగ్, క్యాదాసి ప్రభాకర్, గొడిశెల రమేశ్‌గౌడ్, గాండ్ల చంద్రశేఖర్, సందబోయిన గీతాంజలి, కంచర్ల రేణుక, కొండ్ర స్వరూప, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం