
అంబటి జోజిరెడ్డి
కరీంనగర్: అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడటం, వేధింపులకు గురి చేయడం మానుకోవాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి ఆరోపించారు. గురువారం సంఘ కార్యాలయంలో మాట్లాడుతూ జిల్లాలో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌లో ఉంటే ఓ న్యాయం, వేరే పార్టీలో ఉంటే మరో న్యాయమా అని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకుల అక్రమ దందాలపై గతంలో స్వయంగా సీపీ వెల్లడించిన విషయాలను పక్కదారి పట్టిస్తూ తమకు అనుకూలంగా లేని వారిపై అక్రమ కేసులు పెట్టడం రివాజుగా మారిందని, కరీంనగర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నేతలను భయబ్రాంతులకు గురిచేయడం మానుకోవాలని సూచించారు.