
కబడ్డీలో తలపడుతున్న బాలికలు
కొత్తపల్లి: కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ–టెక్నో స్కూల్ మైదానంలో గురువారం కొత్తపల్లి మండల స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కోవిడ్–19 విపత్కర పరిస్థితుల అనంతరం తొలిసారిగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన ఈ పోటీలకు వివిధ పాఠశాలల నుంచి స్పందన లభించింది. మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో భాగంగా తొలిరోజు అండర్ 14, 17 బాలికల విభాగాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. అల్ఫోర్స్ ఈ– టెక్నో స్కూల్ మైదానంలో వి.నరేందర్ రెడ్డి సహకారంతో ఉత్సాహంగా సాగిన ఎస్‌జిఎఫ్ మండల స్థాయి క్రీడాపోటీలను మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజుతో కలిసి ఎంపీపీ పిల్లి శ్రీలతమహేష్ ప్రారంభించారు. చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలంటే మానసిక ప్రశాంతత అవసరమని, అందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల నిర్వాహకులు వి.మల్లారెడ్డి, ఎంఈఓ మధుసూదనాచారి, ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రెటరీ పి.శ్రీనివాస్, మండల క్రీడా కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, వ్యాయామ ఉపాధ్యాయులు కె.రాంరెడ్డి, జి.సత్యనారాయణ, టి.శ్రీనివా స్, హరీశ్, రవి, సందీప్‌సింగ్, ఇంద్రజిత్ సింగ్, రాజబాబు, మహేందర్, ఇతర వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, పాల్గొన్నారు.
కొనసాగుతున్న అర్బన్ జోన్ క్రీడాపోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: పాఠశాలల క్రీడా సమాఖ్య పోటీల్లో భాగంగా రెండు రోజులుగా సెయింట్ జాన్ పాఠశాలలో అండర్ 14, 17 బాలబాలికల కరీంనగర్ అర్బన్ జోన్ క్రీడా పోటీలు కొనసాగుతున్నాయి. గురువారం బాలబాలికలకు అథ్లెటిక్స్ విభాగంలో పోటీలు నిర్వహించారు.
ప్రారంభమైన
కరీంనగర్ రూరల్ మండల స్థాయి పోటీలు
కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో గురువారం కరీంనగర్‌రూరల్ మండలస్థాయి పాఠశాలల అండర్ 14, 17 క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను ఎంపీపీ లక్ష్మయ్య ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మధుసూదనాచారి, పోతన శ్రీనివాస్, బిట్ర శ్రీనివాస్, రాజిరెడ్డి, సౌజన్య, రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

క్రీడలను ప్రారంభిస్తున్న ఎంపీపీ శ్రీలత

కరీంనగర్‌రూరల్ పోటీల ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఎంపీపీ లక్ష్మయ్య