
కరీంనగర్‌కల్చరల్: నగరంలోని జిల్లాపరిషత్ కార్యాలయ ఆవరణలో ఇండియన్ యూత్ సెక్కూర్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన రైతు గణేశ్ అందరినీ ఆకట్టుకుంటోంది. నాగలి ఎత్తుకొని, పొలం దున్నుతున్న, నాటు వేస్తూ, పంటకు మందు వేస్తూ, కూరగాయలు అమ్మే ఐదు రకాల వినాయకుడి ప్రతిమలు ఆకర్షిస్తున్నాయి. బస్‌స్టాప్ ఎదురుగా కావడంతో కాలేజీ విద్యార్థులు, ప్రయాణికులు రైతు వినాయకుడిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రైతు ప్రాముఖ్యత తెలియజేసేందుకు ప్రతిష్ఠించినట్లు ఆర్గనైజర్ ఘన్‌శ్యామ్ ఓజా తెలిపారు.