
చిన్న మల్లయ్య (ఫైల్)
జ్యోతినగర్ : ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్నపూర్ణకాలనీలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. అన్నపూర్ణ కాలనీలో తల్లి మంగతో మొలుగూరి బిట్టూ (30) నివాసముంటున్నాడు. ఆదివారం తల్లి వరంగల్‌కు వెళ్లగా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చనిపోతున్నానంటూ కరీంనగర్‌లో ఉంటున్న తన మేనమామకు సందేశం పంపించినట్లు తెలుస్తోంది. బిట్టూ కృష్ణానగర్‌లో వాహనాల వ్యాపారం చేసేవాడు. ఆర్థిక ఇబ్బందులతో పాటు తండ్రి అనారోగ్యంతో, సోదరి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని, తల్లి మంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు ఎస్సై జీవన్ తెలిపారు.
ఇంట్లోంచి వెళ్లి..
కెనాల్‌లో శవమై..
ధర్మపురి : మద్యం మత్తులో మూడురోజుల కింద ఇంట్లోంచి వెళ్లిన ఓ వ్యక్తి మృతదేహం కెనాల్‌లో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గిరిజన గ్రామమైన బోదరి నక్కల చెరువు గూడెంకు చెందిన సర్పంచ్ అద్దరి బుచ్చవ్వ భర్త చిన్న మల్లయ్య (58) మద్యం మత్తులో మూడురోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లాడు. కొడుకు అద్దరి శేఖర్ ఈనెల 10న ధర్మపురి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి తెలిసిన చోటల్లా గాలిస్తున్నారు. ఆదివారం గ్రామ సమీపంలోని రాయకుంట మినీ కెనాల్‌లో మృతదేహం లభ్యమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మద్యం మత్తులో ప్రమాదవశాత్తు కెనాల్‌లో పడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు.

మొలుగూరి బిట్టూ (ఫైల్)