డీఆర్‌డీవోగా దామోదర్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

డీఆర్‌డీవోగా దామోదర్‌రెడ్డి

May 23 2026 1:28 AM | Updated on May 23 2026 1:28 AM

డీఆర్‌డీవోగా దామోదర్‌రెడ్డి ‘జీవ వైవిధ్యంలో ప్రజల భాగస్వామ్యమే కీలకం’ ‘ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు’ నేటి నుంచి విత్తన వారోత్సవాలు

కామారెడ్డి క్రైం: గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా అధికారి (డీఆర్‌డీవో)గా దామోదర్‌రెడ్డి నియమితులయ్యారు. సిద్దిపేట జిల్లాలో ఎంపీడీవోగా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై కామారెడ్డికి వచ్చారు. శుక్రవారం బాధ్యత లు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. కాగా ఇక్కడ డీఆర్‌డీవోగా పనిచేసిన సురేందర్‌ను కామారెడ్డి జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవోగా బదిలీ అయ్యారు.

కామారెడ్డి అర్బన్‌: జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పడాల తిరుపతి పేర్కొన్నారు. అంతర్జాతీ య జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఒకరోజు జాతీయ వెబినార్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పడాల తిరుపతి మాట్లాడు తూ పర్యావరణ పరిరక్షణ, సమతుల్యత కాపాడడంలో విద్యార్థులు, యువత, గ్రామీణ ప్రజల పాత్ర కీలకమన్నారు. విత్తన బంతుల తయారీ, నీటి సంరక్షణ, ప్లాస్టిక్‌ వినియోగ నియంత్రణ వంటి చర్యలు గొప్ప ఫలితాలిస్తాయన్నారు. వెబినార్‌లో వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల వృక్షశాస్త్ర ప్రోఫెసర్లు, విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. కామారెడ్డి కళాశాల ప్రిన్సిపల్‌ విజయ్‌కుమార్‌, వృక్షశాస్త్ర విభాగాధిపతి దినకర్‌, సమన్వయకర్తలు జయప్రకాశ్‌, సుధాకర్‌, శ్రీవల్లి, శ్రీనివాస్‌రావు, రాములు పాల్గొన్నారు.

బిక్కనూరు: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని జిల్లా సహకార అధికారి రామ్మోహన్‌రావు కేంద్రాల నిర్వాహకులు, అధికారులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. సిబ్బందితో మాట్లాడి కొనుగోళ్ల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ తూకం వేసిన వడ్లను వెంటవెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని సూచించారు. ఎప్పటికప్పుడు ట్యాబ్‌ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట సొసైటీ కార్యదర్శి రాజు, సిబ్బంది రవి కిరణ్‌, స్వామి తదితరులున్నారు.

నాగిరెడ్డిపేట: జిల్లాలో శనివారం నుంచి విత్తన వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మాల్తుమ్మెద శివారులోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం(టీఆర్‌వీకే) శాస్త్రవేత్త అనిల్‌రెడ్డి తెలిపారు. వారోత్సవాలలో భాగంగా వరి సన్న రకాలైన ఆర్‌డీఆర్‌–1200, ఆర్‌డీఆర్‌–1162 విత్తనాలను మాల్తుమ్మెద శివారులో గల తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. 10 కిలోల బస్తాను రూ.750కి అందించనున్నట్లు తెలిపారు. విత్తనాలు అవసరమైన రైతులు మాల్తుమ్మెద సమీపంలోని టీఆర్‌వీకేలో సంప్రదించాలని సూచించారు.

24 నుంచి ఇంటర్‌

సప్లిమెంటరీ మూల్యాంకనం

ఖలీల్‌వాడి(నిజామాబాద్‌ అర్బన్‌): జిల్లా కేంద్రంలోని డీఐఈవో కార్యాలయంలో ఇంటర్‌ సప్లిమెంటరీ రెండో స్పెల్‌ సబ్జెక్ట్‌ల మూ ల్యాంకనం 24 నుంచి ప్రారంభమవుతుందని ఇంటర్‌ విద్యాధికారి రవికుమార్‌ తెలిపారు. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌, కెమిస్ట్రీ, కామర్స్‌ సబ్జెక్ట్‌ల అధ్యాపకులు 24న రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రయివేటు, రెసిడెన్షి యల్‌ జూనియర్‌ కళాశాలల లాగిన్‌లలో అ ధ్యాపకుల అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌లు ఉంచినట్లు తెలిపారు. అధ్యాపకులను ఈనెల 23న రిలీవ్‌ చేయాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. మూల్యాంకనంలో అధ్యాపకులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement