కామారెడ్డి టౌన్: రెడ్డి ఐక్య వేదిక తాత్కాలిక రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఒక హోటల్‌లో రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ.. తాను సంఘం అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడంతో, నూతన తాత్కాలిక కమిటీని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. వేదిక తాత్కాలిక రాష్ట్ర కన్వీనర్‌గా నాగర్తి చంద్రారెడ్డిని, రాష్ట్ర కో–ఆర్డినేషన్ చైర్మన్‌గా సంధి తిరుపతి రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే కో–కన్వీనర్లుగా ఎలిమినేటి సుమన్ రెడ్డి, బండ గోపాల్ రెడ్డి, నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, రామమ్మగారి బాగా రెడ్డిలను ఎన్నుకున్నట్లు వివరించారు. నూతనంగా ఎన్నికై న కమిటీ సభ్యులు రెడ్డి సామాజిక వర్గ ఐక్యతకు, సమాజ శ్రేయస్సుకు నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
ఇందల్వాయి: మండలంలోని తిర్మన్‌పల్లి గ్రామంలో గురువారం రాత్రి రెండు ఇళ్లల్లో చోరీ జరిగినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.గ్రామానికి చెందిన బొడ్డు పెద్ద రాజన్న ఇంటికి తాళం వేసి డాబాపై పడుకున్నాడు.మరో వ్యక్తి తాటిపాముల శ్రీనివాస్‌గౌడ్ ఇంటికి తాళం వేసి కేరళ వెళ్లాడు. గమనించిన దుండగు లు తాళం గడియలు పగులగొట్టి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో అరతులం బంగారం,16 తులాల వెండి, రాజ న్న ఇంట్లో ఏడు తులాల బంగారం,10 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.ఘటనా స్థలాన్ని డిచ్‌పల్లి సీఐ వినోద్ పరిశీలించారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
లింగంపేట(ఎల్లారెడ్డి):మండల కేంద్రానికి చెందిన కోమట్‌పల్లి పోచయ్య(48) అనే వ్యక్తి అ ప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. శుక్రవారం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి ముందు ఉన్న వేపచెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. కుటుంబసభ్యులు, చుట్టు పక్కవారు గమనించి వచ్చేలోపే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య రాజమణి, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


