బాన్సువాడ రూరల్: ఎటువంటి పొరపాట్లు లేకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి జనగణన విజయవంతం చేయాలని బాన్సువాడ ఆర్డీవో రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో బాన్సువాడ అర్బన్,రూరల్ సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లు, సంబంధిత సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. జనగణన దేశాభివృద్ధికి ఎంతో కీలకమని, ప్రభుత్వం రూపొందించే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేందుకు కచ్చితమైన గణాంకాలు అవసరమన్నారు. ప్రభుత్వం అందించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ సమయానికి గణన పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలు, సాంకేతిక అంశాలు, డేటానమోదు విధానంపై చర్చించారు. తహసీల్దార్ నరేందర్, ఆర్పీలు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి: జనగణనను సక్రమంగా నిర్వహించాలని ఆర్డీవో ప్రభాకర్ అన్నారు. శుక్రవారం తహసీల్ కార్యాలయంలో జనగణన సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగణన సిబ్బంది ప్రజల వివరాలను గోప్యంగా ఉంచాలని అన్నారు. జనగణనలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని సూచించారు. తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, ఎంపీడీవో తాహేరాబేగం, జనగణన సిబ్బంది తదితరులున్నారు.


