● జిల్లా కేంద్రంలో
మానవహారంతో నిరసన
● మద్దతు ప్రకటించిన బీజేపీ
కామారెడ్డి టౌన్ : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజు కొనసాగింది. ఉదయం కామారెడ్డి డిపో ఎదుట కార్మికులు మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. అరగంట పాటు బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. ఆర్టీసీ కార్మికు ల హక్కుల కోసం పోరాడుతూ ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్ మృతికి కార్మికులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కార్మికుల బలవన్మరణాలకు రవాణా శాఖ మంత్రే బాధ్యత వహించాలని,తక్షణమే ఆయన త న పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, బకాయి ఉన్న రెండు పీఆర్సీలను వెంటనే అమలు చేయాలని, యూనియన్లకు అనుమతులు పునరుద్ధరించాలి డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించాలన్నారు.
సమ్మెకు మద్దతు..
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ, టీఆర్పీ, ఎంఆర్‌పీఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. కార్మికుల పోరాటం న్యాయమైనదని, ప్రభుత్వం దిగివచ్చే వ రకు అండగా ఉంటామని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి కామారెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి శంకర్‌గౌడ్ మృతికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు వెంకట్ గౌడ్, కృష్ణమూర్తి,రమే
ష్, రాజు, ఖదీర్, వీడీ దాస్, క్రాంతి, సంగారెడ్డి చారి, శేఖర్, లత, భాగ్య, అరుణమ్మ, రాజేందర్, దత్తు, సూర్యకళ తదితరులు పాల్గొన్నారు.


