గత నాలుగేళ్లుగా ఫలితాలు ఇలా..
బీబీపేటలో..
మూడోసారీ నిరాశే..
షరా మామూలుగా ఈసారి కూడా ఇంటర్‌లో బాలికలదే పైచేయిగా నిలిచింది. పలువురు రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులు సాధించారు. కాగా ఇంటర్‌లో జిల్లా నిరాశాజనకమైన ఫలితాలను నమోదు చేసింది. రాష్ట్రంలో సెకండియర్‌లో 32వ స్థానంలో, ఫస్టియర్‌లో 33వ స్థానంలో నిలిచింది. – కామారెడ్డి టౌన్
షరా మామూలే..
ఇంటర్మీడియట్ బోర్డు ఆదివారం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాల్లో జిల్లా విద్యార్థులు నిరాశపరిచారు. రాష్ట్రంలోని మొత్తం జిల్లాల ఫలితాలతో పోలిస్తే కామారెడ్డి 32వ స్థానంలో ఉంది. ఫస్టియర్‌లో 33వ స్థానంలో నిలిచింది. ఫస్టియర్‌లో 49.40 శాతం, సెకండియర్‌లో 63.09 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
ఫస్టియర్ ఫలితాలు ఇలా..
జనరల్ : మొత్తం 7,231 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 3,572 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత 49.40 శాతంగా నమోదైంది. ఇందులో బాలురు 3,286 మంది పరీక్షలకు హాజరుకాగా.. 1,200 మంది మాత్రమే పాసయ్యారు. అంటే 36.52 శాతమే ఉత్తీర్ణులయ్యారన్న మాట. బాలికలు మాత్రం 60.13 శాతం పాస్ కావడం గమనార్హం. 3,945 మంది పరీక్షలు రాయగా 2,372 మంది పాస్ అయ్యారు.
ఒకేషనల్ : మొత్తం 1,782 మంది విద్యార్థులకుగాను 924 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 51.85 గా ఉంది. ఇందులో బాలురు 884 మందికి 298 మంది, బాలికలు 898 మందికి 626 మంది ఉత్తీర్ణులయ్యారు.
జనరల్ : మొత్తం 6,129 మంది పరీక్షలు రాయగా 3,867 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 63.09 గా నమోదైంది. ఇందులో బాలురు 2,657 మందికిగాను 1,321 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత 49.72 శాతంగా ఉంది. బాలికలు 3,472 మంది పరీక్ష రాయగా 2,546 మంది పాస్ అయ్యారు. అంటే 72.33 మంది పాసయ్యారన్న మాట. ప్రైవేట్‌గా పరీక్ష రాసిన వారిలో 1,065 విద్యార్థులకుగాను 338 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.
ఒకేషనల్ : మొత్తం 1,609 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,058 మంది పాసయ్యారు. 65.76 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 749 మందికి 349 మంది, బాలికలు 860 మందికి 709 మంది పాస్ అయ్యారు. ప్రైవేట్‌గా పరీక్ష రాసిన వారిలో 137 మందికిగాను 62 మంది ఉత్తీర్ణత సాధించారు.
సంవత్సరం స్థానం ఫస్టియర్ సెకండియర్
శాతం శాతం
2023 13 50.03 67.43
2024 35 34.81 44.29
2025 35 50.09 56.38
2026 32 49.40 63.09
బీబీపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థులు నిరాశ పరిచారు. ఈ కళాశాలలో ముగ్గురు విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. ముగ్గురూ ఫెయిల్ అయ్యారు. నాగిరెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 30 మంది సెకండియర్ పరీక్షలు రాయగా ముగ్గరు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్‌లో 63 మందికి ఆరుగురు పాస్ అయ్యారు.
ఇంటర్‌లో జిల్లాలో గణనీయంగా ఉత్తీర్ణత శాతం తగ్గుతోంది. 2023లో రాష్ట్ర స్థాయిలో 13వ స్థానంలో ఉన్న కామారెడ్డి.. 2024లో 35వ స్థానానికి పడిపోయింది. 2025లోనూ అదే స్థానంలో ఉంది. ఈసారి కాస్త మెరుగుపడి 32వ స్థానానికి చేరింది. ఇంటర్‌లో మూడేళ్లుగా అట్టడుగుననిలుస్తుండడం ఇటు విద్యాశాఖ వర్గాలను, అటు విద్యార్థుల తల్లిదండ్రులను నిరాశకు గురిచేస్తోంది.
ఇంటర్‌లో సత్తా చాటిన బాలికలు
కాస్త మెరుగుపడిన జిల్లా స్థానం
32వ స్థానంలో కామారెడ్డి
ఫస్టియర్‌లో 49.40 శాతం,
సెకండియర్‌లో 63.09 శాతం ఉత్తీర్ణత


