నందిపేట్(ఆర్మూర్): మండల కేంద్రంలోని ఓ ఇంటర్ విద్యార్థి అదృశ్యమైనట్లు ఎస్సై శ్యామ్‌రాజ్ ఆదివారం తెలిపారు. వివ రాలు ఇలా.. డొంకేశ్వర్ మండలం జిజి నడ్కుడ గ్రామానికి చెందిన అరవింద్ రెడ్డి అనే ఇంటర్ విద్యార్థి కుటుంబం కొన్నే ళ్లుగా నందిపేటలోనే నివాసం ఉంటున్నారు. అరవింద్‌రెడ్డి నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఆదివారం ఇంటర్ రిజల్ట్ వచ్చిన తర్వాత అతడు కనిపించకుండా పోయాడు. ఉదయం కిరాణా షాపులోకి వెళ్లివస్తానని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్లగా ఇప్పటికీ తిరిగి రాలేడు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. విద్యార్థి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నట్లు ఎస్సై శ్యామ్రాజ్ తెలిపారు. ఇది లా ఉండగా ఇంటర్ ఫలితాల్లో అరవింద్ ఫెయిల్ అయ్యాడని సమాచారం.


