మాచారెడ్డి: అక్కాపూర్, ఘన్‌పూర్(ఎం) గ్రామాల్లో ఆదివారం మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదింటి కల సాకారమైందని అన్నారు. అక్కాపూర్, ఘన్‌పూర్ గ్రామాల్లో మూడేసి ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు కట్న కానుకలు సమర్పించారు. సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు నరసింహారెడ్డి, చంద్రునాయక్, రామ్మోహన్, శ్రీనివాస్చారి, సతీష్ తదితరులు ఉన్నారు.
తిమ్మారెడ్డిలో..
ఎల్లారెడ్డిరూరల్: తిమ్మారెడ్డి గ్రామంలో నూతనంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించిన సురేందర్‌కు కాంగ్రెస్ నాయకులు నూతన వస్త్రాలను బహూకరించారు. కాంగ్రెస్ నాయకులు సాయిబాబా, శ్రీనివాస్‌రెడ్డి, కుడుముల సత్యనారాయణ తదితరులున్నారు.
జంగంపల్లిలో..
భిక్కనూరు: మండల కేంద్రంతో పాటు జంగంపల్లి, తిప్పాపూర్, పెద్దమల్లారెడ్డి, రామేశ్వర్‌పల్లి గ్రామాల్లో ఆదివారం జోరుగా ఇందిరమ్మ గృహ ప్రవేశాలు జరిగాయి. సర్పంచ్‌లు బల్యాల రేఖ, శ్రీవాణి, కుంట లింగారెడ్డి, కోడూరి సాయగౌడ్, చేపూరి రాణిలు నూతన గృహాలను ప్రారంభించారు. నూతన వస్త్రాలను బహూకరించారు. ఉపసర్పంచ్‌లు దుంపల మోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, జీవన్, చైతన్య, వినోద్‌గౌడ్, నేతలు శ్రీనివాస్‌గౌడ్, శ్రీరాం వెంకటేష్‌లు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి అన్నారు. బ్రాహ్మణపల్లి, కన్‌కల్, సంతాయిపేట్ గ్రామాలలో ఆదివారం లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి ప్రవేశాలు చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, అఽధికార ప్రతినిధి షౌకత్‌అలీ, నాయకులు వెంకట్‌రాంరెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, శ్యాంరావు, సంజీవులు, అఖిల్‌రావు, కిష్టారెడ్డి, నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


