మాల ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ సొసైటీ జిల్లా కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

మాల ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ సొసైటీ జిల్లా కార్యవర్గం ఎన్నిక

Apr 13 2026 8:14 AM | Updated on Apr 13 2026 8:14 AM

మాల ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ సొసైటీ జిల్లా కార్యవర్గం ఎన్నిక భట్రాజు సంఘం కార్యవర్గం .. తెలంగాణా జాగృతిని మరింత బలోపేతం చేస్తాం సీసీ రోడ్డు పనుల పరిశీలన

కామారెడ్డి అర్బన్‌: మాల ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ సొసైటీ(ఎంఈడబ్ల్యూఎస్‌) జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం సొసైటీ రాష్ట్ర కార్యదర్శులు పాత రాము, అయ్యాల సంతోష్‌ల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా భూంపల్లి సంగమేశ్వర్‌, ప్రధాన కార్యదర్శిగా దొ నకంటి పాండురంగం,కోశాధికారిగా పడిగె రా జు,వర్కింగ్‌ అధ్యక్షుడిగా మెట్టు రవీందర్‌, ఉ పాధ్యక్షులుగా గైని ప్రవీణ్‌, ఇటికెల సత్యం సా యిలు,పెరుమాండ్ల మహేందర్‌, కార్యదర్శిగా నాంపల్లి,కార్యదర్శిగా లక్ష్మీనారాయణ,సమన్వయకర్తగా సంజీవ్‌, సాంస్కృతిక కార్యదర్శిగా కౌడి రవీందర్‌, సలహాదారులుగా బొంద రాజ్‌కుమార్‌,పెరుమాండ్ల రాము ఎన్నికయ్యారు.

కామారెడ్డి అర్బన్‌: తెలంగాణ రాష్ట్ర భట్రాజు సంఘం కామారెడ్డి జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా అర్వరాజు నరేందర్‌ రాజు, యూత్‌ అధ్యక్షుడిగా సాయి సుమంత్‌ విశ్వరాజు, మహిళా విభాగం అధ్యక్షురాలిగా బట్టు పద్మజ ఎన్నికయ్యారు. జిల్లాలో భట్రాజుల అభివృద్ధి, ఐక్యత, సామాజిక సేవల కోసం కృషి చేస్తామని ప్రమాణం చేశారు.

తాడ్వాయి(ఎల్లారెడ్డి): తెలంగాణా జాగృతి పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆ పార్టీ మండల అధ్యక్షుడు గరిడె భుజంగరావు అన్నారు. సంగోజీవాడి గ్రామంలో ఆదివారం ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు తెలంగాణా జాగృతిలో చేరారు. జాగృతి పార్టీ అధినేత్రి కవిత ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో తిరుగుతూ కమిటీలను వేస్తున్నామని ఆయన తెలిపారు. నాయకులు బల్వంత్‌రావు, రాజేందర్‌రావు, ఆనంద్‌రావు, గణేష్‌, కృష్ణమూర్తి, గంట రాములు, కిషన్‌, సాయిలు, రసూల్‌, మొగులాన్‌ తదితరులు పాల్గొన్నారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): పొల్కంపేటలో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్డు పనులను ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్‌ పరిశీలించారు. పొల్కంపేట ఉన్నత పాఠశాల నుంచి వేస్తున్న రింగ్‌ రోడ్డుకు సీఆర్‌ఆర్‌ నిధులు రూ.1.25 కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. పనులు నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. నూతన గృహ ప్రవేశాలు చేశారు. నాయకులు ఎల్లమయ్య, నగేష్‌, నాగరాజు, రాజు, లింగం, కృష్ణమూర్తి, రాజమౌళి, రమేశ్‌, తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement