బీబీపేట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000–01లో పదవ తరగతి చదివిన విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్కచోట కలుసుకున్నారు. పాఠశాలలో ఆదివా రం వారంతా కలిసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏళ్ల తర్వాత విద్యార్థులు మళ్లీ కలుసుకోవడంతో ఒకరినొకరు ఆప్యా యంగా పలుకరించుకొని, ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను, కార్యక్రమానికి ఆహ్వానించి, సన్మానించారు. ఉపాధ్యాయులు కాశీనాథం, రమేష్ శర్మ, గంగాధర్, అంజయ్య, కిష్టారెడ్డి, విజయ్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, విశ్వ మోహన్, ఎల్లం, వెంకటేశం, విద్యార్థులు పాల్గొన్నారు.


