నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ గ్రామశివారులో అక్రమంగా 10 ఎడ్లను తరలిస్తున్న వాహనాన్ని ఆదివారం పట్టుకున్నట్లు ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు. ఈమేరకు వాహన యాజమాని అబ్దుల్ రహీంతోపాటు డ్రైవర్ సాయిలుపై కేసునమోదు చేసినట్లు ఆయన చెప్పారు. పట్టుబడిన వాహనంలోని ఎడ్లను మెదక్ మండలంలోని గోశాలకు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డిరూరల్: ఆవులను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు బజరంగ్‌దళ్ నాయకులు ఆదివారం తెలిపారు. బాన్సువాడ వైపు నుంచి హైదరాబాద్ వైపునకు బొలేరో వాహనంలో పది ఆవులను తరలిస్తుండగా, ఎల్లారెడ్డిలో వాహనాన్ని ఆపి పట్టుకున్నట్లు వారు తెలిపారు. అనంతరం పోలీసులకు అప్పగించినట్లు వారు తెలిపారు. పోలీసులు ఆవులను గోశాలకు తరలించారు.


