నవీపేట: నవీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామ శివారులో శుక్రవారం రాత్రి ధాన్యం కుప్పను ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలైనట్లు ఎస్సై శ్రీకాంత్ శనివారం తెలిపారు. వివరాలు ఇలా.. అనంతగిరి గ్రామానికి చెందిన మహేష్ జిల్లాకేంద్రంలోని మెడికవర్ ఆస్పత్రిలో వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతడు పని నిమిత్తం జిల్లాకేంద్రానికి బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యలో మల్కాపూర్‌లోని రోడ్డుపై వరి ధాన్యం కుప్ప అంచుల వెంబడి వేసిన రాళ్లను అతడు ఢీకొనడంతో కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో మహేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వరి కుప్ప యజమాని ఈర్ల ఉస్సేన్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.


