క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Apr 11 2026 8:22 AM | Updated on Apr 11 2026 8:22 AM

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి

భర్తకు తీవ్ర గాయాలు

ఆర్మూర్‌టౌన్‌: బైక్‌పై వెళ్తున్న దంపతులను బ్రాహ్మణపల్లి చౌరస్తాలో గుర్తుతెలియని వాహ నం ఢీకొనడంతో భార్య మృతిచెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ తెలిపిన వివరాలు ఇలా.. ఆర్మూర్‌ మండలం గోవింద్‌పేట్‌ గ్రామానికి చెందిన కొత్తూరు లక్ష్మీ (40), తన భర్త పోషన్నతో కలిసి బైక్‌పై పనుల నిమిత్తం గురువారం అంకాపూర్‌కు వెళ్లారు. కాగా అంకాపూర్‌ నుంచి తిరిగి గోవింద్‌పేట్‌ గ్రామానికి వస్తున్న సమయంలో బ్రాహ్మణపల్లి చౌరస్తా వద్ద జక్రాన్‌పల్లి వైపు నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో లక్ష్మీ అక్కడిక్కడే మృతిచెందగా పోషన్నకు కాళ్లకు తీవ్ర గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోషన్నకు ప్రభుత్వ అస్పత్రిలో చికిత్స అందించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

చికిత్స పొందుతూ ఒకరు..

మోర్తాడ్‌(బాల్కొండ): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మోర్తాడ్‌ యువకుడు శుక్రవారం మరణించాడు. ఎస్సై రాము తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన దాసరి సాయికుమార్‌(28) పౌర సరఫరాల శాఖలో హమాలీగా పని చేస్తున్నాడు. ఈనెల 2న అతడు తన బైక్‌పై దొన్కల్‌ నుంచి మోర్తాడ్‌కు వస్తుండగా ఓ కారు వెనుకనుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈఘటనలో అతడు తీవ్రంగా గాయపడగా, నిజామాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా శుక్రవారం పరిస్థితి విషమించి మృతిచెందాడు. సాయి మృతితో అతని కుటుంబం పెద్ద దిక్కులేకుండా పోయింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించినట్లు వెల్లడించారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన మన్నిబీ అనే మహిళ బుధవారం ఇంటికి తాళం వేసి సిర్గాపూ ర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లింది. శుక్రవారం ఉదయం ఆమె ఇంటి తలుపులు తెరిచి ఉన్నట్లు స్థానికులు గుర్తించి ఆమెకు సమాచారం అందించారు. వెంటనే ఆమె, తన బంధువుతో కలిసి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి రూ.4వేలు చోరీ చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు సమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్‌ కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement