పేదలకు వరం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ | - | Sakshi
Sakshi News home page

పేదలకు వరం సీఎం రిలీఫ్‌ ఫండ్‌

Apr 11 2026 8:22 AM | Updated on Apr 11 2026 8:22 AM

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బాన్సువాడ: పేదలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వరంలా మారిందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పో చారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సు వాడలోని తన నివాసంలో నియోజకవర్గానికి చెందిన 182 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు అనారోగ్యానికి గురైతే రూ.లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించుకునే పరిస్థితి ఉండదని, సీఎం రిలీప్‌ ఫండ్‌ నిధులతో పేదలకు ఆర్థికంగా భరోసా ఉంటుందని అన్నారు. ఆస్పత్రి ఖర్చులు ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు.

అంగన్‌వాడీ టీచర్లకు ఫోన్లు..

బాన్సువాడ ఐసీడీఎస్‌ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లకు మొబైల్‌ ఫోన్లను పోచారం శ్రీనివాస్‌రెడ్డి అందజేశారు. ప్రభుత్వం నుంచి అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ ఫోన్లు మంజూరు అయ్యాయని తెలిపారు. బీర్కూర్‌ ఏఎంసీ చైర్మన్‌ శ్యామల, నాయకులు కృష్ణారెడ్డి, కాసుల రోహిత్‌, ఖలేక్‌, మోహన్‌నాయక్‌, గంగుల గంగారాం, ఎజాస్‌, సీడీపీవో సౌభాగ్య, సూపర్‌వైజర్లు తదితరులున్నారు.

కల్యాణలక్ష్మి చెక్కులు..

లింగంపేట(ఎల్లారెడ్డి): పొల్కంపేటలో శుక్రవారం 8 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను గ్రామ సర్పంచ్‌ దివిటి రమేశ్‌ పంపిణీ చేశారు. ఉపసర్పంచ్‌ లలిత, కార్యదర్శి అశ్వక్‌, జీపీవో శ్రీకాంత్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement