నాగిరెడ్డిపేట మండలం గోలిలింగాల గ్రామానికి చెందిన చాకలి బాలమ్మ, కిష్టయ్య దంపతులకు ముగ్గురు కుమారులు. కిష్టయ్య తొమ్మిదేళ్ల కింద చనిపోయాడు. బాలమ్మ ముగ్గురు కొడుకులు, కోడల్లు, వాళ్ల పిల్లలతో కలిసి ఉంటోంది. వాళ్ల పిల్లలు కూడా పెరిగి పెద్దవారయ్యారు. ఒకరిద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. పెద్ద కొడుకు నర్సింలుకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు, రెండో కుమారుడు కాశయ్యకు ముగ్గురు కూతుళ్లు, మూడో కుమారుడు రాజయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ముగ్గురి కుమారులు, కోడళ్లు, వారి కుమారులందరూ తనను ప్రేమగా చూసుకుంటారని బాలమ్మ చెబుతోంది.


