భిక్కనూరు: మహిళ సంఘాలకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీవో సురేందర్ అన్నారు. బుధవారం జంగంపల్లిలో వైష్ణవి మహిళ సంఘానికి రూ.8 లక్షలతో మంజూరు చేసిన సెంట్రింగ్‌ను ఆయన పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఈ సెంట్రింగ్‌ను అద్దెకు తీసుకోవాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందితే వారి కుటుంబంతో పాటు రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఏపీడీ విజయలక్ష్మి, డీపీఎం సాయిలు, ఏపీఎం సాయిలు, సీసీ స్వాతి పాల్గొన్నారు.


