రామారెడ్డి(ఎల్లారెడ్డి):ఓ పక్క భానుడి భగభగలు మొదలయ్యాయి..భూగర్భ జలాలు అడుగుంటి గ్రా మాల్లో నీటి కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. కా నీ,ప్రజల దాహార్తిని తీర్చాల్సిన మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరు రోడ్ల పాలవుతున్నాయి. పైపుల లీకేజీలతో నీరంతా వృథాగా పోతుంటే, ట్యాంకులు నిండక ప్రజలు గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతున్నారు.రామారెడ్డిలోని మున్నూ రు కా పు సంఘం పక్కనే ఇసన్నపల్లి వాటర్ ట్యాంకు నింపే మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీతో నెల రోజుల నుంచి నీరు వృథా పోతున్నాయి.రామారెడ్డి మీదు గా దోక్కల్ వెళ్లే దగ్గర ఇసన్నపల్లి రోడ్డు వైపు నెల రో జుల క్రితం మిషన్ భగీరథ పైపు లైన్ లీకేజీ అవుతూనే ఉంది. ఈ లీకేజీ నీళ్లలో వేసవి తాపం తాళలే క శునకాలు జలకాలాటలు ఆడుతున్నాయి. ఇంత జరుగుతున్న మిషన్ భగీరథ అధికారులు స్పందించకపోవడం గమనర్హం. గతంలో మిషన్ భగీరథ పైపులను లోతుగా పాతి పెట్టకుండా ౖపైపెన వేయడంతో,ఇప్పుడు అవి పలుచోట్ల పగిలి లీకేజీలు ఏ ర్పడ్డాయి. నిత్యం వందలాది లీటర్ల శుద్ధి చేసిన నీ రు వృథాగా పోతున్నాయి. ఫలితంగా ఉదయం వేళ ల్లో ఇళ్లకు సరైన సమయానికి నీరు అందడం లేదు.
నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు..
గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రమవుతున్నా, కళ్లముందే నీళ్లు వృథాగా పోవుతున్నా మిషన్ భగీరథ అధికారులు మాత్రం మొద్దునిద్ర వీడటం లేదు. లీకేజీలను అరికట్టాలని గ్రామస్తులు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదు. దీనిపై వివరణ కోరేందుకు ‘సాక్షి’ మిషన్ భగీరథ ఏఈ వంశీకి ఫోన్ చేయగా, ఆయన స్పందించకపోవడం గమనర్హం.


