ప్రమోషన్ల నిలిపివేతపై నిరసన | - | Sakshi
Sakshi News home page

ప్రమోషన్ల నిలిపివేతపై నిరసన

Apr 8 2026 7:08 AM | Updated on Apr 8 2026 7:08 AM

కామారెడ్డి అర్బన్‌: విద్యుత్‌ శాఖలో ప్రమోషన్లు రాకుండా నిర్లక్ష్యం వహించిన ఉన్నతాధికారుల తీరును ఉద్యోగులు నిరసించారు. 1104 యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఎస్‌ఈ కార్యాలయంలో ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రమోషన్ల కోసం ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించాల్సి ఉండగా చిన్నసాకుతో నిలిపివేశారని 1104 యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు బి.కమలాకర్‌, కార్యదర్శి బీఎన్‌ శ్రీనివాస్‌లు ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో ప్రతినిధులు రాములు, కృష్ణమూర్తి, రవీందర్‌, నర్సింలు, పర్వయ్య, బాలయ్య, సుదర్శన్‌రెడ్డి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement