కుక్కల బెడద నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

కుక్కల బెడద నివారణకు చర్యలు

Apr 6 2026 7:48 AM | Updated on Apr 6 2026 7:48 AM

కుక్కల బెడద నివారణకు చర్యలు క్రీడలపై ఆసక్తి కనబర్చాలి క్రీడాకారులకు సహకారం అందిస్తా మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ కామారెడ్డిలో బైక్‌ చోరీ

దోమకొండ: దోమకొండలో కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకుంటున్నామని గ్రా మ సర్పంచ్‌ ఐరేని నర్సయ్య, ఉపసర్పంచ్‌ బొమ్మెర శ్రీనివాస్‌లు తెలిపారు. బెంబెలెత్తిస్తున్న గ్రామ సింహలు శీర్షికన ఆదివారం ప్రచురితమైన కథానానికి వారు స్పందించారు. కుక్కలను పట్టుకుని వాటికి సంతాన ఉత్పత్తి తిరిగి కాకుండా చేయడానికి కామారెడ్డిలోని కేంద్రానికి తరలిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో కుక్క ల సంచారం విషయాన్ని జీపీ కార్యాలయంలో సిబ్బందికి తెలియజేయాలని వారు కోరారు.

బాన్సువాడ రూరల్‌: యువకులు చెడు వ్యసనాల బారిన పడకుండా క్రీడలపై ఆసక్తి కనబర్చాలని సోమేశ్వర్‌ గ్రామ సర్పంచ్‌ వీరేశం అన్నారు. హనుమాన్‌ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం గ్రామంలో క్రికెట్‌ పోటీలు ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో పాల్గొనడంతో స్నేహభావం, విజయకాంక్ష, జట్టు భావన , శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

బాన్సువాడ రూరల్‌: సీఎం కప్‌ సెకండ్‌ ఎడిషన్‌లో కొత్తాబాదికి చెందిన విద్యార్థిని బెరిల్‌ సింతియారాస్‌ బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబర్చి జిల్లాస్థాయికి ఎంపికకావడం హర్షనీయమని సర్పంచ్‌ సాయాగౌడ్‌ అన్నారు. భవిష్యత్తులోనూ మరింతగా రాణించి కొత్తాబాది పేరును ఇనుమడింపజేయలన్నారు. ఆదివారం విద్యార్థిని బెరిల్‌ సింతియారాస్‌ను ఉప సర్పంచ్‌ సలీమ్‌, వార్డు సభ్యులు, గ్రామ యువకులతో కలిసి ఘనంగా సన్మానించారు. విద్యార్థులు, క్రీడాకారులకు తనవంతు సహకారం అందిస్తామన్నారు.

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండలంలోని వజ్జపల్లి గ్రామంలో ఆదివారం మహిళా సమాఖ్య భవనానికి సర్పంచ్‌ రాధాబాయి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావ్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ కయ్యాల నర్సింలు, ఐకేపీ సీసీ భూమయ్య, వార్డు సభ్యులు హరీష్‌ రావు, నరేశ్‌, గణేశ్‌రావు, శ్రీనివాస్‌, గ్రా మ సంఘం అధ్యక్షురాలు లక్ష్మిబాయి, వీవోఏ రజిని, గ్రామ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ బైక్‌ చోరీకి గురైంది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా.. పట్టణంలోని వాంబే కాలనీలో నివాసం ఉంటున్న బీఆర్‌ఎస్‌ పట్టణ నాయకుడు షౌకత్‌ అలీ శనివారం రాత్రి తన వాహనాన్ని ఇంటి ముందు పార్కింగ్‌ చేశారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ వాహనాన్ని ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు చోరీని గుర్తించి, పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement