బస్సుల్లో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌లేవీ? | - | Sakshi
Sakshi News home page

బస్సుల్లో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌లేవీ?

Apr 5 2026 7:42 AM | Updated on Apr 5 2026 7:42 AM

అన్ని బస్సుల్లో ఏర్పాటు చేస్తున్నాం ఏ బస్సులో చూసినా.. పట్టించుకోని రవాణా శాఖ..

ఖాళీగా దర్శనమిస్తున్న బాక్స్‌లు

చిన్నప్రమాదాలకూ ఆస్పత్రికి

వెళ్లాల్సిన పరిస్థితి

త్వరలో అన్ని ఆర్టీసీ బ స్సుల్లో పూర్తి సామగ్రితో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులు ఏ ర్పాటు కాబోతున్నాయి. ఫస్ట్‌ ఎయిడ్‌ సామగ్రిని కొ నుగోలు చేయడానికి టెండర్లను కూడా ఆహ్వానిస్తున్నారు. బస్సుల్లో అగ్నిమాపక సాధనాలను రీకండిషన్‌ చేయడానికి ఆయా డిపో మేనేజర్లకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాటి ని రీకండిషన్‌ చేయిస్తున్నాం.

–దినేశ్‌కుమార్‌,

ఆర్టీసీ డిపో మేనేజర్‌, కామారెడ్డి

ఎల్లారెడ్డి : మోటారు వాహనాల చట్టం ప్రకారం ఆర్టీ సీ, విద్యాసంస్థల బస్సుల్లో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌లు కచ్చితంగా ఉండాలి. బస్సులో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆస్పత్రికి వెళ్లేలోగా ప్రథమ చికిత్స అందించడానికి వీటిని ఏర్పాటు చేస్తారు. అయితే ఆర్టీ సీ బస్సుల్లో బాక్సులు ఉన్నా వాటిలో ప్రథమ చికి త్సకు అవసరమైనవి కిట్‌లు ఉండటం లేదు. కొన్ని బస్సుల్లో ప్రథమ చికిత్సకు సంబంధించిన వస్తువులు కాకుండా డ్రైవర్‌, కండక్టర్ల వ్యక్తిగత వస్తువులు కనిపిస్తున్నాయి. కొన్ని బస్సుల్లోనైతే వీటిని తెరవరాకుండా సీల్‌ చేశారు. దీంతో ప్రయాణికులు గా యపడితే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లే వరకు చికిత్స అందని పరిస్థితి ఉంది.

జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ డిపోల పరిధిలో 223 ఆర్టీసీ బస్సులు, 60 అద్దె బస్సులు ఉన్నాయి. వీటిలో ఏ బస్సులోనూ ఫస్ట్‌ ఎయిడ్‌ సామగ్రి కనిపించడం లేదు. బస్సుల్లో ప్రథమ చికిత్స సామగ్రి లేకపోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులకు ఎవరికై నా చిన్న గాయమైనా ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సిందే.. పెద్ద గాయాలైనప్పుడు త క్షణం ప్రథమ చికిత్స లభిస్తే గాయం తీవ్రత తగ్గించవచ్చు. కానీ ప్రథమ చికిత్స సామగ్రి లేకపోవడంతో ఆస్పత్రి వరకు వెళ్లే సరికి రక్తస్రావం ఎక్కువై, ప్రాణాల మీదికి వచ్చే ప్రమాదం ఉంటుంది.

నిబంధనల ప్రకారం బస్సుల ఫిట్‌నెస్‌ పరీక్షల స మయంలో బస్సులో ప్రథమ చికిత్స సామగ్రి, అగ్ని మాపక సాధనాలు ఉన్నాయా లేవా అని రవాణా శాఖ అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ ఉంటేనే రోడ్లపై తిరగడానికి అనుమతి ఇవ్వాలి. కానీ రవాణా శాఖ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఇటీవల బస్సు ప్రమాదాల సంఘటనలు జరిగాక బస్సుల్లో అగ్ని మాపక సాధనాలను ఉంచాలని ఆర్టీసీ అధికారులు డిపో మేనేజర్లకు నోటీసులు పంపించారు. తక్షణం అగ్నిప్రమాద సాధనాలకు మరమ్మతులు చేసి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అయితే ఏ బస్సులోనూ అగ్నిమాపక సామగ్రి కనిపించడం లేదు.

కిట్‌లో ఉండాల్సినవి..

నిబంధనల ప్రకారం బస్సులో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ తప్పనిసరిగా ఉండాలి. ఇందులో గాయాలను శుభ్రం చేయడానికి యాంటీసెప్టిక్‌ లోషన్‌, గా యాలకు కట్టు కట్టడానికి స్టెరిలైజ్‌డ్‌ కాటన్‌, గా యాలకు ఇన్‌ఫెక్షన్‌ కాకుండా అయోడిన్‌ ద్రావణం, యాంటీ సెప్టిక్‌ క్రీమ్‌, వేసవిలో ప్రయాణి కులకెవరికైనా వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోతే తాగించడానికి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఉండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement