మాక్లూర్: పెళ్లి అయిన నెలకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. బాన్సువాడకు చెందిన అఖిల (25)కు ఆలూర్ మండలం కల్లేడ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌తో మార్చి 5న వివా హం జరిగింది. శనివారం ఉదయం భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అఖిల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ పేర్కొన్నారు. పూర్తివివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.
దోమకొండ: మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాలు ఇలా.. దోమకొండకు చెందిన బోరెడ్డి నర్సింలు(40) అనే వ్యక్తి కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఆర్థిక సమస్యలతోపాటు కుటుంబ పోషణ నిమిత్తం పలుమార్లు ఇంట్లో గొడవ పడేవాడు. తరచూ తాను ఆత్మహత్య చేసుకొని చనిపోతానంటూ కుటుంబ సభ్యులను బెదిరిస్తుండేవాడు. ఈక్రమంలో శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


