కామారెడ్డి క్రైం: జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలలో భాగంగా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. దీనిని శనివారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 08468–220051 అనే కంట్రోల్ రూం నంబర్‌ను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. కొనుగోళ్లలో ఏవైనా సమస్యలు, సందేహాలు ఉన్నట్లయితే రైతులు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు. డీఎస్‌వో వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్, డీసీవో రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్ ద్వారా
ఇసుక సరఫరా
కామారెడ్డి క్రైం: ఇళ్ల నిర్మాణాలకు గాను ఇసు క సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం ఒక ప్రకటన ద్వా రా తెలిపారు. ఇసుక అవసరం ఉన్న వారు తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. మొదట పంచాయితీ కార్యదర్శి, ఆపై సంబంధిత త హసీల్దార్ ఆ దరఖాస్తులను పరిశీలించి, మంజూరు ఇస్తారని తెలిపారు. అనుమతి పొందిన తర్వాత దరఖాస్తుదారు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ట్రాక్టర్‌తో ఇసుక లభ్యత ఉన్నచోటుకు వెళ్లి ఆన్‌లైన్ ద్వారా పొందిన క్యూ ఆర్ కోడ్‌ను చూపించి ఇసుకను తెచ్చుకోవాలని సూచించారు.
7న కలెక్టరేట్‌లో
ఉద్యోగ మేళా
కామారెడ్డి అర్బన్: కలెక్టరేట్‌లో ఈనెల 7న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపా ధి కల్పనాధికారి రజనికిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్బన్ కంపెనీలో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే ఈ మేళాలో పురుషులకు మాత్రమే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఏడో తరగతి నుంచి ఇంటర్ లేదా ఐ టీసీ చదివిన వారు ఈనెల 7న కలెక్టరేట్‌లో ని 121 నంబర్ గదిలో నిర్వహించే జాబ్‌మేళాకు హాజరు కావాలని, పూర్తి వివరాలకో సం 99639 49655, 63057 43423 నంబర్ల లో సంప్రదించాలని సూచించారు.
8న ఎల్లారెడ్డి డిగ్రీ కళాశాలలో..
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఈనెల 8న జాబ్‌మేళా నిర్వహించనున్న ట్లు ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయ ఫెర్టిలైజర్స్ లో సేల్స్ రిప్రజెంటేటివ్, గ్రూప్ లీడర్, సే ల్స్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం ఈ మేళా ని ర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇంటర్, డి గ్రీ విద్యార్థులు జాబ్ మేళాలో పాల్గొనాలని, పూర్తి వివరాలకు 93467 08846, 99514 79110 నంబర్‌లలో సంప్రదించాలన్నారు.
బీపీసీఎల్‌లో గిరిజన యువతకు శిక్షణ
కామారెడ్డి అర్బన్: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) కేరళలోని కొచ్చి స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలో గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నారు. ఆరు నెలల పాటు శిక్షణతోపాటు ఉచిత వసతి కూడా కల్పించనున్నారు. ఐటీఐ, డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన ఆసక్తిగల గిరిజన యువత ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర డైరెక్టర్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకోసం కలెక్టరేట్‌లోని గిరిజన సంక్షేమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన
వైద్య సేవలు అందించాలి
రామారెడ్డి: ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో రవీందర్ గౌడ్ వైద్యులను ఆదేశించారు. శనివారం అన్నారంలోని పీహెచ్‌సీని ఆయన తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నా రు. వేసవి కాలంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ జాగ్రత్తలపై వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.


