‘డెస్క్‌ బెంచీలను అందించడం అభినందనీయం’ | - | Sakshi
Sakshi News home page

‘డెస్క్‌ బెంచీలను అందించడం అభినందనీయం’

Apr 5 2026 7:42 AM | Updated on Apr 5 2026 7:42 AM

భిక్కనూరులో..

భిక్కనూరు : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం స్థానిక ఎమ్మెల్యే డెస్క్‌ బెంచీలను అందిస్తుండడం అభినందనీయమని తపస్‌ రాష్ట్ర కార్యదర్శి పుల్గం రాఘవరెడ్డి పేర్కొన్నారు. శనివారం తిప్పాపూర్‌లోని పాఠశాలకు బెంచీలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తన తండ్రి కేపీ రాజారెడ్డి పేరిట ఏర్పాటు చేసిన జనసేవా ట్రస్టు ద్వారా నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలకు 6 వేల డెస్క్‌ బెంచీలను అందిస్తున్నారన్నారు. విద్యార్థులకు బెంచీలను సమకూర్చిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం యాదగిరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

భిక్కనూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు డెస్క్‌ బెంచీలను అందించారు. ఈ సందర్భంగా బీజేపీ మండలాధ్యక్షుడు ఉప్పరి రమేశ్‌ మాట్లాడుతూ మండలంలోని 13 పాఠశాలలకు కలిపి 529 డెస్క్‌ బెంచీలను ఎమ్మెల్యే పంపించారన్నారు. వాటిని ఆయా పాఠశాలలకు పంపిణీ చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement