నగరంలో ఐపీఎల్‌ ఫ్యాన్‌ పార్కు | - | Sakshi
Sakshi News home page

నగరంలో ఐపీఎల్‌ ఫ్యాన్‌ పార్కు

Apr 4 2026 8:01 AM | Updated on Apr 4 2026 8:01 AM

సుభాష్‌నగర్‌: ఐపీఎల్‌ క్రికెట్‌ అంటే ఇష్టపడని అభిమానులు ఉండబోరని, వారి కోసం దేశ వ్యాప్తంగా 50 నగరాల్లో ఐపీఎల్‌ ఫ్యాన్‌ (అభిమాని) పార్కులు ఏర్పాటు చేస్తున్నామని బీసీసీఐ ఆపరేషన్‌ మేనేజర్‌ వికాస్‌ పండిట్‌ తెలిపారు. శుక్రవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మ్యాచ్‌ జరిగే స్టేడియంలోకి వెళ్లి చూసి ఆనందించే అవకాశం తక్కువ మందికే ఉంటుందని పేర్కొన్నారు. నిరాశ చెందే అభిమానుల కోసమే జిల్లా కేంద్రంలోని ఉమెన్స్‌ కళాశాల మైదానంలో ఐపీఎల్‌ ఫ్యాన్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత మూడు సీజన్లలో ఏర్పాటు చేశామని, ఎలాంటి రుసుము చెల్లించకుండా ప్రత్యక్ష అనుభూతిని పొందవచ్చని తెలిపారు. ఈ పార్కులో ఫుడ్‌ స్టాల్స్‌ను ఏర్పాటు చే స్తున్నామని, ఫుడ్‌ కోసం కేవలం రూ.100 చార్జీలు విధిస్తున్నామ న్నారు. ఫ్యాన్‌ పార్కు లో శని, ఆదివారాల్లో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లను బిగ్‌ స్క్రీన్‌లపై చూపిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రెటరీ వెంకట్‌రెడ్డి, మేనేజర్‌ దీపక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement