అనారోగ్య సమస్యలతో యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అనారోగ్య సమస్యలతో యువకుడి ఆత్మహత్య

Mar 9 2026 7:35 AM | Updated on Mar 9 2026 7:35 AM

ఎల్లారెడ్డి: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి జీవితంపై విరక్తితో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంబరపు శ్రీనివాస్‌(40) అనే వ్యక్తి కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తితో శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

మహమ్మద్‌నగర్‌లో వృద్ధురాలు..

నిజాంసాగర్‌(జుక్కల్‌): అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు జీవితంపై విరక్తితో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మహమ్మద్‌నగర్‌ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై శివకుమార్‌ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బొట్ల అనుశవ్వ(65) అనే వృద్ధురాలు కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చూయించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తితో శనివారం రాత్రి మండల శివారులోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement