తాగు నీటి ఎద్దడి నివారణకు చర్యలు
నిజాంసాగర్(జుక్కల్): వేసవిలో తాగు నీటిి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మహమ్మద్‌నగర్ ఎంపీడీవో సత్యానారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం మహమ్మద్‌నగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో తాగునీటి ఎద్దడి నివారణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సర్పంచులు రమేష్‌యాదవ్, రఫీ, కిరణ్, గజ్జల జీవన్, హరిన్ కుమార్, కడావత్ శ్రీనివాస్, దఫేదార్ బాలమణి, ఏఈ సుమలత పాల్గొన్నారు.
పిట్లం(జుక్కల్): పిట్లం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం తాగునీటి ఎద్దడి నివారణపై పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లతో ఎంపీడీవో రఘు సమావేశము ఏర్పాటు చేశారు. వేసవికాలంలో నీటి సమస్యలు తలెత్తకుండా, తీసుకోవలసిన జాగ్రత్తలు, సూచనల గురించి పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచ్‌లకు ఆయన వివరించారు. మండల పంచాయతీ అధికారి నాగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాగు నీటి ఎద్దడి నివారణకు చర్యలు


