ప్రారంభమైన ఊర పండుగ
దోమకొండ: మండల కేంద్రంలో 20 ఏళ్ల తర్వాత ఊర పండుగ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం గ్రామంలో ముడుపు కట్టుట(గ్రామ దిగ్బంధం) కార్యక్రమం మొదలు పెట్టారు. చల్లని అంబలి, కొలుపు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్థానిక చాముండేశ్వరి ఆలయం నుంచి బొడ్రాయి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో డప్పుచప్పుళ్ల మధ్య తీసుకువెళ్లి బురుజువద్ద ప్రతిష్ఠాపన చేశారు. సాయంత్రం గ్రామ దేవతలకు పెద్ద ఎత్తున బోనాలు తీశారు. సర్పంచ్ ఐరేని నర్సయ్య, ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, నిర్వాహకులు సిద్దారెడ్డి, మర్రి శేఖర్, కూర చంద్రం, సంతోష్‌రెడ్డి, తదతరులు పాల్గొన్నారు.


