పన్నుల కలెక్షన్ ఫుల్
బాన్సువాడ: మున్సిపల్ ఎన్నికల పూణ్యమా అని పన్ను బకాయిలు వసూలయ్యాయి. మూడు రోజుల్లో ఇంటి పన్నుల బకాయిలు రూ.10 లక్షలపైనే వసూలయ్యాయి. కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న వారు బకాయిలు ఉన్న ఇంటి పన్ను, కుళాయి పన్నులను చెల్లించారు. కౌన్సిలర్‌గా పోటీ చేసే అభ్యర్థితో పాటు గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థితో పాటు వారి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే ఒకరి ఇంటి పన్నులు, కుళాయి పన్నులు చెల్లించారు. స్వతంత్య్ర అభ్యర్థులు మాత్రం వారితో పాటు మరో ఇద్దరు ప్రతిపాదించే వారి బకాయిలు చెల్లించారు. ఇలా కౌన్సిలర్లుగా పోటీ చేసే అభ్యర్థులతో పాటు వారిని ప్రతిపాదించే వారి బకాయి పన్నులు కలిపి మూడు రోజుల్లో రూ.10 లక్షల పైనే వసూలు అయ్యాయి. నో డ్యూ సర్టిఫికెట్ కోసం ఒక్కో సర్టిఫికేట్‌కు రూ.500 వసూలు చేశారు. ఇవి కూడా రూ.2 లక్షల వరకు వసూలైనట్లు తెలిసింది.
● మూడు రోజుల్లో రూ.10 లక్షల
పన్నులు వసూలు


