కుష్టు వ్యాధిపై అవగాహన సదస్సు
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ పీహెచ్‌సీలో శుక్రవారం కుష్టు వ్యాధిపై అవగాహన సదస్సును నిర్వహించారు. కుష్టి వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా పక్షం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వైద్యులు శ్రీలేఖ, సిబ్బంది ఉన్నారు.
మాచారెడ్డి: కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరముందని ఫరీద్‌పేట సర్పంచ్ నరసింహారెడ్డి అన్నారు. పాల్వంచ మండలం ఫరీద్‌పేట్‌లో శుక్రవారం కుష్టు నిర్మూలన దినోత్సవంలో భాగంగా గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. ఉప సర్పంచ్ బాలాగౌడ్, వార్డు సభ్యులు, ఆశ వర్కర్ లక్ష్మి, ఏఎన్‌ఎం రాజ్యలక్ష్మి ఉన్నారు.
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్) రెండో యూనిట్ ఆధ్వర్యంలో లింగాయపల్లిలో శీతాకాల ప్రత్యేక శిబిరం మూడో రోజు శుక్రవారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. జీపీ ఆవరణలో పిచ్చిమొక్కలు తొలిగించి రోడ్డును శుభ్రం చేశారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. ప్రోగ్రాం అధికారి జి.చంద్రశేఖర్‌గౌడ్, సహ చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం, ప్రతినిధులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: పశుపోషణ, దూడల సంరక్షణ, పశుగ్రాసం పెంపకంలో పాడిరైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశువైద్యాధికారులు ఏ.శ్రీనివాస్, అనిల్‌రెడ్డిలు అన్నారు. జిల్లా పశుగణాభివృద్ధి, పశుసంవర్థక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి మండలం ఇస్రోజీవాడిలో పశువుల ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ శిబిరం నిర్వహించి పాడి రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. మండల పశువైద్యాధికారి రవికిరణ్, గ్రామసర్పంచ్ చిందం మల్లేష్, ఉపసర్పంచ్ సిద్ధం స్వామి, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): బాణాపూర్, బోనాల్, బాణాపూర్ తండాల్లో శుక్రవారం ఎంపీవో మలహరి అభివృద్ది పనులు పరిశీలించారు. ఆయా గ్రామాల్లో చేపడుతున్న ఇందిరమ్మ ఇల్లు, పారిశుద్ధ్య పనులు, మిషన్ భగీరథ తాగునీటి సరఫరా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలను పరిశీలించారు. అలాగే లింగంపల్లి గ్రామంలో ఎంపీడీవో నరేష్, సర్పంచ్ ప్రత్యూష వాటరింగ్ డే నిర్వహించారు.
బిచ్కుంద(జుక్కల్): మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థులకు పార్టీ బి–ఫాంలను ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అందించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మందిని అభ్యర్థులు నామినేషన్లు వేశారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటర్లు 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తారని ఎమ్మెల్యే అన్నారు. నాయకులు విఠల్‌రెడ్డి, దడ్గి నాగ్‌నాథ్, వెంకట్‌రెడ్డి, గంగాధర్, అసద్ అతీ, సామిల్ షెట్కార్ ఉన్నారు.
కుష్టు వ్యాధిపై అవగాహన సదస్సు
కుష్టు వ్యాధిపై అవగాహన సదస్సు


