ఆర్టీసీ వీలీన చట్టం అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ వీలీన చట్టం అమలు చేయాలి

Jan 21 2026 7:09 AM | Updated on Jan 21 2026 7:09 AM

ఆర్టీ

ఆర్టీసీ వీలీన చట్టం అమలు చేయాలి

విలీనం చేయాలని నిరసన

కామారెడ్డి టౌన్‌: టీజీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ గతంలో చేసిన చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని కోరుతూ కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు మంగళవారం గవర్నర్‌కు లేఖలు రాశారు. ఆ చట్టం నేటికీ అమలుకు నోచుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్‌ను వేడుకున్నారు. కామారెడ్డి డిపో నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు ఈ లేఖలను పోస్ట్‌ ద్వారా పంపించారు.

బాన్సువాడ: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం బాన్సువాడ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్న ఆర్టీసీని పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. జేఏసీ నాయకులు దాస్‌, సంజీవ్‌, నాగరాజు తదితరులున్నారు.

ఆర్టీసీ వీలీన చట్టం అమలు చేయాలి1
1/1

ఆర్టీసీ వీలీన చట్టం అమలు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement