సమర్థవంతమైన నాయకులనే ఎన్నుకోవాలి
● ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ రూరల్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకులనే ఎన్నుకోవాలని ఎ మ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచా రం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బాన్సువాడ పట్టణంలోని 15, 16 వార్డుల్లో స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. గ్రామ పంచాయతీగా ఉన్న బాన్సువాడను మున్సిపాలిటీగా మార్చుకుని సుమారు రూ.200 కోట్లతో అభివృద్ధి చేశానన్నారు. రానున్న రోజుల్లో బాధ్యతతో పనిచేసే వారిని ఎన్నుకుంటే రాష్ట్రంలోనే బాన్సువాడ మున్సిపాలిటీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెల్సుకున్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, నాయకులు జంగం గంగాధర్, కృష్ణారెడ్డి, గురువినయ్, శ్రీధర్, ఎజాజ్, అసద్‌బిన్ మోసీన్, నర్సన్నచారీ, నార్లసురేష్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.


