సిట్ నోటీసులకు భయపడేవారు ఎవరూ లేరు
● ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఎల్లారెడ్డి : సిట్ నోటీసులకు భయపడేవారు ఎవరూ లేరని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకై న పాత్ర పోషించిన హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి నోటీసులు ఎన్ని ఇచ్చినా భయపడేవారు ఎవరూ లేరన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిదిపైన వేసిన టెండర్ల బాగోతం గుట్టురట్టు కావడంతో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నాయకులు నర్సింలు, సతీష్, జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


