మాల్తుమ్మెద ఉద్యానక్షేత్రం సందర్శన
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : మాల్తుమ్మెద ఉద్యానక్షేత్రాన్ని సోమవారం డీహెచ్‌వో జ్యోతి సందర్శించారు. మాల్తుమ్మెద ఉద్యానక్షేత్రంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంతోపాటు క్షేత్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితుల గురించి ఈ నెల 17న ‘సాక్షి’ దినపత్రికలో ‘అడవిని తలపిస్తున్న ఉద్యానక్షేత్రం’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. ఈ మేరకు ఉద్యానక్షేత్రాన్ని ఇన్‌చార్జి హెచ్‌వో సంతోషితో కలిసి అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాద కారణాలపై ఆరా తీశారు.
ఉన్నతాధికారులకు నివేదించాం
మాల్తుమ్మెద ఉద్యానక్షేత్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉన్నతాధికారులకు నివేదించామని డీహెచ్‌వో జ్యోతి తెలిపారు. నాగిరెడ్డిపేటలో ఆ మె మాట్లాడారు. ఉద్యానక్షేత్రం నిర్వహణకు అ వసరమైన బడ్జెట్ రావడంలేదని, సిబ్బంది కొరత సైతం ఉందని చెప్పారు. పరిస్థితులపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామ న్నారు. సిబ్బంది నవీన్, రాంచంద్రం ఉన్నారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): చిన్నఆత్మకూర్‌లో మ రణించినవారి ఆఖరి మజిలీకి కొంతకాలంగా అవస్థలు తప్పడంలేదు. గ్రామానికి చెందిన అ వదూత విజయ్‌కుమార్ ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఆయన కుటుంబసభ్యు లు సోమవారం విజయ్‌కుమార్ అంత్యక్రియ లు చేపట్టారు. శ్మశానవాటికకు వెళ్లేందుకు స రైన రోడ్డు లేకపోవడంతో వరినాట్లు వేసిన పొ లంలో నుంచే విజయ్‌కుమార్ పాడెను మోసుకుంటూ వెళ్లారు. తమ సమస్యను పరిష్కరించాలని ప్రజలు పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది.
వృద్ధురాలి ఆత్మహత్య
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలం కుర్లా శివారులోని మంజీర వాగులో కంఠం గంగవ్వ(70) అనే వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు. బీర్కూర్‌కు చెందిన కంఠం గంగవ్వ సంవత్సరం నుంచి మానసికస్థితి సరిగ్గా లేక ఇబ్బంది పడుతోంది. సోమవారం మధ్యాహ్నం కుర్లా వద్ద మంజీర వాగులో పడి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కొడుకు కంఠం బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
పిట్లం(జుక్కల్): మండలంలోని కారేగాం గ్రామ శివారులో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు విద్యుత్ ట్రా న్స్‌ఫార్మర్లను దొంగిలించారు. ట్రాన్స్‌ఫార్మర్లలోని విలువైన కాపర్ వైరు, ఆయిల్‌ను చోరీ చేశారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, పొలాల వద్ద అర్ధరాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తమకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.
కామారెడ్డి క్రైం: మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి మాయమాటలు చెప్పి దోపిడీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. పట్టణానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అనే వ్యక్తి వారం రోజుల క్రితం రామారెడ్డి చౌరస్తాలో ఉన్న ఓ కల్లు దుకాణంలో కల్లు సేవించాడు. మత్తులో ఉన్న అతనితో ఇద్దరు వ్యక్తులు మాటలు కలిపారు. ఇంటి వద్ద దింపుతామని నమ్మించి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని సిరిసిల్లా రోడ్డు ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. రాడ్డుతో దాడి చేస్తామని బెదిరించి ఇర్ఫాన్ వద్దనున్న రూ.700 నగదు, సెల్‌ఫోన్‌ను లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు విచారణ జరిపి నిందితులను ఇస్లాంపుర కాలనీకి చెందిన మహ్మద్ ఖుద్బుద్దీన్, మహ్మద్ సమీర్‌గా గుర్తించారు. సోమవారం వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, సిబ్బందిని అభినందించారు.
మాల్తుమ్మెద ఉద్యానక్షేత్రం సందర్శన
మాల్తుమ్మెద ఉద్యానక్షేత్రం సందర్శన


