ప్రతీ కేంద్రంలో సుమారు 650 మంది ఓటర్లు | - | Sakshi
Sakshi News home page

ప్రతీ కేంద్రంలో సుమారు 650 మంది ఓటర్లు

Jan 17 2026 7:31 AM | Updated on Jan 17 2026 7:31 AM

ప్రతీ కేంద్రంలో సుమారు 650 మంది ఓటర్లు

ప్రతీ కేంద్రంలో సుమారు 650 మంది ఓటర్లు

ప్రతీ కేంద్రంలో సుమారు 650 మంది ఓటర్లు

మున్సిపాలిటీల వారీగా ఓటర్లు, పోలింగ్‌ కేంద్రాలు

పోలింగ్‌ కేంద్రాల వారీగా

తుది ఓటర్ల జాబితా విడుదల

జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో

ప్రకటించిన అధికారులు

కామారెడ్డి టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పోలింగ్‌ కేంద్రాల తుది ఓటరుజాబితాను అధికారులు శుక్రవారం అధికారికంగా విడుదల చేశారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల పరిధిలో ఓటర్ల సౌకర్యార్థం ఈ కేంద్రాలను ఖరారు చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి సుమారు 650 ఓటర్లను కేటాయిస్తూ యంత్రాంగం జాబితాను విడుదల చేశారు. అలాగే ఓటర్లు తమ ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా కామారెడ్డిలో 152, బాన్సువాడలో 39, బిచ్కుందలో 24, ఎల్లారెడ్డిలో 24 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫొటోలతో కూడిన పోలింగ్‌ కేంద్రాల తుది ఓటర్ల జాబితాను మున్సిపల్‌, తహసీల్దార్‌, కార్యాలయాల్లో ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.

పట్టణం వార్డులు మొత్తం ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలు

కామారెడ్డి 49 99,313 152

బాన్సువాడ 19 24,188 39

ఎల్లారెడ్డి 12 13,265 24

బిచ్కుంద 12 12,759 24

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement