మెరుగైన వైద్య సేవలందించాలి
కామారెడ్డి టౌన్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి టి.నాగరాణి సూచించారు. ఆరోగ్య సేవల సలహా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జీజీహెచ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరు చట్టాలు, హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో విద్య, ఆర్‌ఎంవో రవీందర్‌గౌడ్, వైద్యుడు సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో నూతన రైల్వే బ్రిడ్జీల నిర్మాణాలతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రైల్వే అధికారులతో కలిసి రోడ్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణాల కోసం స్థలాలను పరిశీలించారు. ఓరియంటల్ స్కూల్ నుంచి పాత బస్టాండ్ వరకు సర్క్యులేషన్ ఏరియా పెంచుతున్నామన్నారు. రైల్వే క్వార్టర్స్ షిఫ్ట్ చేసి రైల్వే స్టేషన్ ముఖద్వారం పెంచాల్సి వస్తుందన్నారు. ప్రియా టాకీస్ రోడ్ నుంచి రైల్వే స్టేషన్ మీదుగా ఇందిరా చౌక్ వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశామన్నారు. వికాస్‌నగర్ నుంచి రైల్వే ట్రాక్ మీదుగా ఇస్లాంపూర్‌కు, స్నేహపూరి కాలనీ నుంచి రైల్వే ట్రాక్ మీదుగా కలెక్టర్ ఆఫీస్ వరకు బ్రిడ్జీలను నిర్మిస్తామన్నారు. పాత రాజంపేట వద్ద బ్రిడ్జి గురించి అధికారులతో చర్చించామన్నారు. కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ఇంజినీర్ అమిత్ అగర్వాల్, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ నవశ్రీ, అధికారులు దుర్గాప్రసాద్, శశాంత్ నాందేవ్, శంభుదయాళ్ మీనా, ధర్మారావు తదితరులున్నారు.
కామారెడ్డి టౌన్: జిల్లాలోని ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం ఎంటీపీ(మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ) నిర్వహణకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎంటీపీ ప్రోగ్రాం అధికారి ఎమీమ్ తెలిపారు. శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఎంటీపీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ ఆస్పత్రులతో ఎంటీపీ అమలు, నిబంధనలు, అనుమతులపై చర్చింరారు. నిబంధనలు పాటించని అస్పత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
మెరుగైన వైద్య సేవలందించాలి
మెరుగైన వైద్య సేవలందించాలి


