కల్యాణిలో ఫ్లాగ్ మార్చ్
ఉమ్మడి నిజాంసాగర్ మండలంలో..
ఎల్లారెడ్డి రూరల్ : కల్యాణి గ్రామంలో పోలీసులు శుక్రవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గ్రామంలో ప్రతి కాలనీలో తిరిగి ఓటుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా ఓటు వేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ రాజారెడ్డి, ఎస్సై మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్: నిజాంసాగర్, మహమ్మద్‌నగర్ మండల కేంద్రాలతో పాటు మాగి గ్రామంలో శుక్రవారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, ఎస్సై శివకుమార్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.


