గ్రామాల అభివృద్ధే లక్ష్యం
● కేంద్ర, రాష్ట్ర నిధులతో
సమస్యలు పరిష్కరిస్తాం
● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి టౌన్: నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాలలో విజయం సాధించారు. దీనిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాచౌక్ నుంచి పార్టీ కార్యాలయం వరకు విజయోత్సవ ర్యాలీ తీశారు. ర్యాలీలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పంచాయతీలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 3 వేల కోట్ల చొప్పున నిధులు రావాల్సి ఉందన్నారు. వాటితో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. పంచాయతీ ఎన్నికలలో గెలిచిన వారికి అభినందించారు. కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్వగ్రామంలో 30 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మద్దతుదారు విజయం సాధించారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే జోష్‌తో సత్తాచాటుతామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, పట్టణ, మండల అధ్యక్షులు పండ్ల రాజు, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మోహన్‌రెడ్డి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.


