ఎన్నికలలో పొరపాట్లకు తావివ్వొద్దు
● కౌంటింగ్ పూర్తవగానే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలి
● టెలి కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి వివిధ మండలాల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రెండో విడత ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాలెట్ బాక్సులు, పే పర్లు, సీలింగ్ మెటీరియల్‌ను ముందుగానే సిద్ధం చే యాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద అభ్యర్థుల వి వరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నారు. అసలైన ఓటర్‌కు బదులుగా ఇతరులు ఓటు వేసినట్లు తేలి తే టెండర్ ఓటుకు వెళ్లాలన్నారు. టెండర్ ఓట్లు 0.1 శాతానికి మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపును మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలని, అనంతరం వార్డుల, సర్పంచ్‌ల ఓట్ల లెక్కింపు చే పట్టాలని సూచించారు. ఫలితాల అనంతరం విజేతల కు ఫాం 29 ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలన్నారు. ఉప సర్పంచ్ ఎన్నికలను కౌంటింగ్ పూర్తి కాగానే నిర్వహించాలన్నారు. ఈ ప్రక్రియలో సర్పంచ్‌తో పాటు 50 శాతం సభ్యుల హాజరు తప్పనిసరి అని పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పోలింగ్‌కు సంబంధించిన ఎన్నికల సామగ్రి ముందుగానే పూర్తిగా సిద్ధం చేయాలన్నారు. పోలింగ్ శాతాన్ని ఉదయం 9, 11, మధ్యాహ్నం 1 గంటలకు, చివరగా తుది నివేదికను పంపడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
రెండో విడత సిబ్బందికి ర్యాండమైజేషన్
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను శుక్రవారం కలెక్టెరేట్‌లో నిర్వహించారు. జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు సత్యనారాయణరెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ల సమక్షంలో ఈ ప్రక్రియను పూర్తి చేసి జీపీలకు పీవోలు, ఏపీవోలను కేటాయించారు.


