పల్లెపోరులో ఆమె కీలకం
అన్ని చోట్లా అతివలే అధికం..
పల్లెల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలయ్యింది. మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతకు సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తున్నారు. రెండో విడత, మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈనెల 11, 14, 17 తేదీలలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలలోనూ మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. జిల్లాలో ఓటర్ల లెక్కలను గమనిస్తే అన్ని ప్రాంతాల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేసేవారంతా మహిళల ఓట్లపై దృష్టి సారించారు. వారి మద్దతు కోసం అప్పుడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
బాన్సువాడ 14,109 15,344 02 29,455
భిక్కనూరు 18,708 20,404 02 39,114
బీబీపేట 10,003 10,802 00 20,805
బిచ్కుంద 13,984 14,557 03 28,544
బీర్కూర్ 9,532 10,688 00 20,220
దోమకొండ 11,548 12,918 00 24,466
డోంగ్లీ 7,349 7,384 00 14,733
గాంధారి 19,981 20,466 00 40,447
జుక్కల్ 18,461 18,682 00 37,143
కామారెడ్డి 8,824 9,890 00 18,714
లింగంపేట 18,334 19,814 00 38,148
మాచారెడ్డి 9,475 10,291 01 19,767
మద్నూర్ 16,192 16,477 00 32,669
మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
మహ్మద్‌నగర్ 6,553 7,467 01 14,021
నాగిరెడ్డిపేట 12,032 13,831 00 25,863
నస్రుల్లాబాద్ 9,981 11,312 00 21,293
నిజాంసాగర్ 6,775 7,504 00 14,279
పాల్వంచ 8,016 9,098 00 17,114
పెద్దకొడప్‌గల్ 8,819 9,008 01 17,828
పిట్లం 17,225 18,299 02 35,526
రాజంపేట 10,771 11,692 00 22,463
రామారెడ్డి 12,843 14,218 00 27,061
సదాశివనగర్ 15,856 17,202 01 33,059
తాడ్వాయి 12,298 13,807 00 26,105
ఎల్లారెడ్డి 9,839 11,054 00 20,893
మొత్తం 3,07,508 3,32,209 13 6,39,730
జిల్లాలో 25 మండలాల పరిధిలో 532 గ్రామ పంచాయతీలు, 4,656 వార్డులు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 6,39,730 కాగా.. ఇందులో పురుషులు 3,07,508 మంది, సీ్త్రలు 3,32,209 మంది ఉన్నారు. అంటే పురుషులకన్నా సీ్త్రల ఓట్లు 24,701 ఎక్కువగా ఉన్నాయి. దాదాపు అన్ని గ్రామాల్లో పురుషులకన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడం గమనార్హం. దీంతో ఎన్నికలపై వారి ప్రభావం ఎక్కువగా ఉండనుంది. దీనికి తోడు ఓటర్లుగా ఉన్న వారిలో పురుషులు చాలామంది బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. దీంతో మహిళా ఓట్లకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. వారి మద్దతు ఎవరికి లభిస్తే వారే విజతగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. అందుకే పోటీలో నిలబడేవారంతా మహిళల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు.
జిల్లాలో పురుషులకన్నా మహిళా ఓటర్లే అధికం
గెలుపోటములను శాసించేది వారే...
అతివలను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి సారించిన ఆశావహులు
పంచాయతీ ఎన్నికల్లో మహిళా శక్తి కీలకం కానుంది. జిల్లాలో అతివల ఓట్లు ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. దీంతో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే ఆమె ఓట్లకు ప్రాధాన్యత పెరిగింది. వారిని ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావహులున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
పల్లెపోరులో ఆమె కీలకం


