సాక్షి గొంతునొక్కే కుట్ర | - | Sakshi
Sakshi News home page

సాక్షి గొంతునొక్కే కుట్ర

Oct 17 2025 6:38 AM | Updated on Oct 17 2025 6:38 AM

సాక్ష

సాక్షి గొంతునొక్కే కుట్ర

సాక్షి గొంతునొక్కే కుట్ర చట్టాలను గౌరవించాలి పతనం తప్పదు

మీడియాపై రాజకీయ కక్ష

కేసుల నమోదు సిగ్గుచేటు

పత్రికా స్వేచ్ఛను కాపాడాలి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చట్టాలను గౌరవించకుండా కేవలం కక్ష సాధింపుతో సాక్షిపై దాడులు చేస్తున్నారు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపుగానే భావిస్తున్నాం. ఏమైనా ఉంటే న్యాయ, చట్టపరంగా ముందుకు వెళ్లాలి. ఇలా అక్రమ కేసులు పెట్టి పత్రికాస్వేచ్ఛను, గొంతును నొక్కేందుకు ప్రయత్నించడం సరికాదు.

– శివప్రసాద్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కన్వీనర్‌

రాజకీయ కక్షలతో సాక్షిపై దాడులు చేస్తూ కేసులు చేస్తున్నారు. పత్రిక గొంతు నొక్కితే పతనం తప్పదు. గత కొద్ది రోజులుగా సాక్షిపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును అంతా గమనిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో పత్రికలపై జరుగుతున్న దాడులను అందరూ ఖండించాల్సిందే.

– పద్మ వెంకట్‌, ఏబీవీపీ రాష్ట్ర

కార్యవర్గ సభ్యుడు

కామారెడ్డి టౌన్‌/బాన్సువాడ/ఎల్లారెడ్డి: ప్రజా సమస్యలపై ప్రశ్ని స్తున్న ‘సాక్షి’ గొంతును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నొక్కుతోందని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛ ను హరిస్తోందన్నారు. ప్రజల పక్షాన అక్షర స మరం చేస్తున్న కక్షగట్టి ఎడిటర్‌ ఆర్‌ ధనంజయరెడ్డితోపాటు పలువురు జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిండం, విచారణ పేరుతో సాక్షి ప్రధాన కార్యాలయంపై పోలీసులు దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించా రు. సాక్షిపై దాడులను ఆపాలని, అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ శుక్రవారం ఉదయం బాన్సువాడలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాకు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, విద్యార్థి సంఘాల, సీసీఐ, సీపీఎం నాయకులు హా జరుకానున్నారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే

అక్రమ కేసులా..?

ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే..

కక్ష సాధింపులు మానుకోవాలి

నేడు బాన్సువాడలో ధర్నా

మీడియాపై రాజకీయ కక్ష తగదు. వాస్తవాలను చెబుతున్న సాక్షిని కేసులు పెట్టి అడ్డుకోవాలని కూట మి ప్రభుత్వం చూస్తోంది. మీడియాపై అధికారుల దాడులు, ఒత్తిళ్లు, వేధింపులు ఆపకపోతే తీవ్ర పరిణాలుంటాయి. దీన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణిస్తున్నాం. – విజయ్‌కుమార్‌, బీసీ విద్యార్థి

సంఘం బాన్సువాడ డివిజన్‌ అధ్యక్షుడు

ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న సాక్షి ఎడిటర్‌, జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం సిగ్గుచేటు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడులు, కేసుల నమోదు పత్రికాస్వేచ్ఛకు గొడ్డలి పెట్టుగా భావిస్తున్నాం. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం తీరుమార్చుకోవాలి.

– సురేశ్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర కోశాధికారి

పత్రికా స్వేచ్ఛపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా ఉంటే చట్టపరంగా చూసుకోవాలని తప్ప ఇలా వ్యక్తిగతంగా సాక్షిపై దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయిండం సరికాదు. పత్రికా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం కాపాడాలి.

– లక్ష్మణ్‌యాదవ్‌, టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు

సాక్షి గొంతునొక్కే కుట్ర1
1/5

సాక్షి గొంతునొక్కే కుట్ర

సాక్షి గొంతునొక్కే కుట్ర2
2/5

సాక్షి గొంతునొక్కే కుట్ర

సాక్షి గొంతునొక్కే కుట్ర3
3/5

సాక్షి గొంతునొక్కే కుట్ర

సాక్షి గొంతునొక్కే కుట్ర4
4/5

సాక్షి గొంతునొక్కే కుట్ర

సాక్షి గొంతునొక్కే కుట్ర5
5/5

సాక్షి గొంతునొక్కే కుట్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement